
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం ఆయన జైలు నుంచి విడుదల కావడంపపై మంత్రి అంబటిరాంబాబు సెటైర్లు వేశారు. కడిగిన ముత్యంలా వస్తాడన్నారు..కంటి ఆపరేషన్ కే వచ్చారని ట్వీట్ చేశారు. విజనరీ లీడర్ కి విజన్ సరిచేసుకోమని బెయిల్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వచ్చేది ప్రజల కోసం కాదని.. కంటి ఆపరేసషన్ కోసమంటూ విమర్శించారు.
ఎన్నికల తర్వాత ఏపీలోనూ జెండా పీకేస్తారు
స్కిల్ స్కాంకేసులో అక్టోబర్ 31న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. అయితే న్యాయం గెలిచిందని టీడీపీ నేతలు సంబరాలు చేసుకోవడంపై అంబటి కౌంటర్ వేశారు. చంద్రబాబుకు కళ్లు కనిపించడం లేదని..కంటి ఆపరేషన్ కోసమే చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిందని చెప్పారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. కంటి ఆపరేషన్ తర్వాత చంద్రబాబు జైలుకెళ్లాల్సిందేనని సూచించారు. తెలంగాణలో జెండా పీకేశారని.. వచ్చే ఎన్నికల తర్వాత ఏపీలోనూ టీడీపీ జెండా పీకేస్తారని సెటైర్లు వేశారు అంబటి.
ఏ తప్పూ చేయలేదు
చంద్రబాబు జైలు నుంచి వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తానే ఏ తప్పూ చేయలేదని తెలిపారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు సంఘీభావం తెలుపుతూ రోడ్లపైకి వచ్చి పోరాడారని.. ఇంకా పూజలు చేశారని.. వారందరికి అభినందనలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తనకు మద్దతుగా పోరాడిన వారి అభిమానాన్ని తన జీవితంలో మర్చిపోలేనన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు ఎంతో సేవ చేశానని.. ప్రభుత్వ విధానాల వల్ల చాలా మందికి ప్రయోజనం కలిగిందన్నారు.
కడిగిన ముత్యంలా వస్తాడన్నారు
— Ambati Rambabu (@AmbatiRambabu) November 1, 2023
కంటి ఆపరేషన్ కే వచ్చాడు ! @ncbn@naralokesh