చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ ఢిల్లీ పర్యటన: అంబటి రాంబాబు

చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ ఢిల్లీ  పర్యటన: అంబటి రాంబాబు

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు.  ఇదే విషయాన్ని అసెంబ్లీలో సీఎం  జగన్ స్పష్టం చేశారని తెలిపారు.   పోలవరం  ప్రాజెక్టును చంద్రబాబు అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. పోలవరం ఆలస్యానికి  చంద్రబాబే కారణమని ఆరోపించారు. పోలవరంపై నాదేండ్ల మనోహర్ అజ్ఞానిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలవరంపై అవాకులు చెవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు.

చంద్రబాబు ఆదేశాల మేరకే పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని అంబటి రాంబాబు అన్నారు.  చంద్రబాబును సీఎం చెయ్యడానికే పవన్ పార్టీ పెట్టారా? అని ప్రశ్నించారు. బీజేపీతో బందం తెంచుకొమ్మని చెప్పి పవన్ ను చంద్రబాబు ఢిల్లీ  పంపించారని తెలిపారు.  కాపు ఓట్లు చీల్చాలన్నదే చంద్రబాబు ప్రయత్నమన్నారు. గొడవ చెయ్యడానికి పోలవరం వెళితే ఎలా ఊరుకుంటారని ప్రశ్నించారు. పోలవరం పునరావాసం కోసం కేంద్ర ప్రభుత్వమే నిధులివ్వాలని డిమాండ్ చేశారు.  పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పిన వాళ్లు ఇప్పుడేమయ్యారని ప్రశ్నించారు అంబటి.