రిటైర్‌‌మెంట్ చేస్తున్నట్లు ట్వీట్.. ఆ వెంటనే డిలీట్

రిటైర్‌‌మెంట్ చేస్తున్నట్లు ట్వీట్.. ఆ వెంటనే డిలీట్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న సీనియర్ ప్లేయర్, తెలుగు ఆటగాడు.. అంబటి రాయుడు ఐపీఎల్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించడం అందర్నీ విస్మయానికి గురి చేసింది.  ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ గా మారిపోయింది. చివరి ఐపీఎల్ అని సంతోషంగా తాను ప్రకటించడం జరుగుతుందని, 13 ఏళ్ల పాటు రెండు గొప్ప జట్లతో తాను కలిసి నడవడం జరిగిందని.. ఈ అవకాశం కల్పించినందుకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు ట్వీట్ లో తెలిపారు.

కానీ కాసేపటికే ట్వీట్ ను డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది. అసలు ఆయన రిటైర్ మెంట్ ప్రకటించారా ? లేదా ? అనేది తెలియరావడం లేదు. ధోనీ, రాయుడు లాంటి కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోతే పరిస్థితి ఏంటనీ ఆలోచనలో సీఎస్ కే యాజమాన్యం పడిపోయినట్లు సమాచారం. ఇక అంబటి రాయుడు విషయానికి వస్తే.. IPL 2010 సీజన్ తో ఇతను అడుగు పెట్టాడు. మొత్తం 187 మ్యాచ్ ల్లో 4 వేల 187 పరుగులు సాధించాడు. ఈ సీజన్ లో గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో 46 పరుగులు, ముంబై ఇండియన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 78 రన్లు చేశాడు.

మరిన్ని వార్తల కోసం :

నల్లపిల్లి కారణంగా ఆర్సీబీ, పంజాబ్ మ్యాచ్ కి అంతరాయం

అతను తొందర్లోనే టీమిండియాకు