
ముంబై: ఐపీఎల్‌లో సూపర్ పెర్ఫామెన్స్ చేస్తున్న ముంబై ఇండియన్స్ యంగ్‌స్టర్, హైదరాబాదీ తిలక్ వర్మపై ఆ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. తను తొందర్లోనే టీమిండియాకు అన్ని ఫార్మాట్లకు ఆడతాడని జోస్యం చెప్పాడు. ‘తిలక్ అద్భుతమై ప్లేయర్. తొలి సీజన్‌లో ఇంత ప్రశాంతంగా ఆడటం అందరికీ సాధ్యం కాదు. తను తొందర్లోనే అన్ని ఫార్మాటల్లో ఇండియాకు ఆడుతాడని అనుకుంటున్నా. తనలో మంచి టెక్నిక్, టెంపర్‌మెంట్ ఉంది. పరుగులు చేయాలన్న తపన కనిపిస్తోంది కాబట్టి తిలక్‌కు మంచి భవిష్యత్ ఉంటుంది’ అని రోహిత్ పేర్కొన్నాడు.