నల్లపిల్లి కారణంగా ఆర్సీబీ, పంజాబ్ మ్యాచ్ కి అంతరాయం

V6 Velugu Posted on May 14, 2022

నిన్న(శుక్రవారం) ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసక్తికర ఘటన జరిగింది. పిల్లి కారణంగా మ్యాచ్ కు కాసేపు అంతరాయం కలిగింది. అయితే పిల్లి గ్రౌండ్ లోకి వచ్చి ఆటగాళ్లను ఇబ్బందేం పెట్టలేదు. కానీ సైట్  స్క్రీన్  మీద దర్జాగా కూర్చొని మ్యా చ్  చూసింది. పిల్లి జాలీగా ఎంజాయ్ చేసినప్పటికి.. స్ట్రైక్ లో ఉన్న బ్యాట్స్ మెన్  ఇబ్బంది పడాల్సి వచ్చింది. సైట్  స్క్రీన్ నుంచి ఏ చిన్న ఇబ్బంది కలిగిన బ్యాట్స్ మన్  తన ఫోకస్  కోల్పోతుంటాడు. స్ట్రైక్ లో ఉన్న డుప్లెసిస్ ను కూడా ఇబ్బంది పడ్డాడు. అంపైర్ కు విషయం తెలుపగా.. మ్యాచ్  నిలిపివేసి సిబ్బందికి చెప్పి పిల్లిని అక్కడి నుంచి పంపించేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్  మీడియాలో వైరల్ గా మారింది. కొందరు నల్లపిల్లిరావడం వల్లే ఆర్సీబీ మ్యాచ్ ఓడిందని సెటైర్లు వేస్తున్నారు. ఈ మ్యాచ్ లో  209 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులకు  చేసింది.

 

Tagged play, Hilarious scenes, cat interrupt, PBKS vs RCB match

Latest Videos

Subscribe Now

More News