హెచ్‌సీఏకు అంబటి రాయుడు గుడ్ బై!

హెచ్‌సీఏకు అంబటి రాయుడు గుడ్ బై!

ముంబై: సీనియర్‌ బ్యాటర్‌ అంబటి రాయుడు మరోసారి హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)ను వీడబోతున్నాడు. వచ్చే  దేశవాళీ సీజన్‌లో అతను బరోడాకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఐపీఎల్‌కు ముందే అతను బరోడా క్రికెట్‌ సంఘాన్ని (బీసీఏ)ను సంప్రదించాడని బీసీఏ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. 36 ఏళ్ల రాయుడు గతంలో నాలుగు సీజన్ల పాటు బరోడా తరఫున పోటీ పడ్డాడు.  కాగా, హెచ్‌సీఏ పెద్దలతో గొడవ కారణంగా గతంలో హైదరాబాద్‌ టీమ్‌ను వీడిన అతను కొన్ని సీజన్ల కిందట తిరిగొచ్చాడు. కానీ, హెచ్‌సీఏతో మళ్లీ పొసగకపోవడం వల్లే రాయుడు హైదరాబాద్‌ను వీడి మళ్లీ బరోడాకు ఆడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.