భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. కలెక్టరేట్లలో కలెక్టర్లు, అధికారులు, పార్టీ కార్యాలయాలు, పట్టణాల్లోని అంబేద్కర్ విగ్రహాల వద్ద ప్రజాప్రతినిధులు, నేతలు నివాళులు అర్పించారు.
పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని, ఆయన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. పలు చోట్ల బాబాసాహెబ్ విగ్రహాలను ఆవిష్కరించారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు విర్వహించారు. అన్నదానాలు చేశారు. -వెలుగు, నెట్వర్క్

