- సమాజంపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి
- అంబేద్కర్ లా కాలేజీలో ఘనంగా ఓరియంటేషన్ ప్రోగ్రాం
ముషీరాబాద్, వెలుగు: లీగల్ ఎయిడ్, లోక్ అదాలత్, క్లినికల్ లీగల్ ఎడ్యుకేషన్వంటి అంశాల్లో న్యాయ విద్యార్థులు తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలని వక్తలు సూచించారు. బాగ్లింగంపల్లిలోని డా.బి.ఆర్.అంబేద్కర్ లా కాలేజీలో శనివారం ఫస్టియర్ విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం – 2025 నిర్వహించారు. కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ డీన్ ప్రొ.ఎన్.వెంకటేశ్వర్లు, సివిల్ కోర్టు అడిషనల్ ప్రధాన న్యాయమూర్తి కె.మురళీ మోహన్, డా.ధరణి కోట సుయోధన్, ఇన్స్టిట్యూట్ కరస్పాండెంట్ డా.జి.సరోజా వివేక్, జాయింట్ సెక్రటరీ పీవీ రమణకుమార్, సీఈవో ప్రొ.ఆర్.లింబాద్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తి సవాళ్లు, -అవకాశాలు, భారత రాజ్యాంగ విలువలు, చట్ట శాఖల పనితీరుపై వివరించారు. విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని, సమాజం పట్ల సంపూర్ణ అవగాహన కోసం నిరంతరం అధ్యయనం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ డా.సృజన, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.
