
హైదరాబాద్, వెలుగు: కరోనా ఎఫెక్ట్ తో ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండు తెలుగు రాష్ర్టాల్లో జరగాల్సిన పరీక్షలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్‌యూనివర్సిటీ వాయిదా వేసింది. సీబీసీఎస్ సిస్టమ్‌లో డిగ్రీ ఫస్టియర్ఫస్ట్ సెమిస్టర్, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఫస్ట్ సెమిస్టర్, సప్లిమెంటరీ, ఎంబీఏ సెకండ్ సెమిస్టర్, బీఎల్ఐఎస్సీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్‌ను వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించారు.