టూరిజం శాఖలో ఆఫీసర్ల బదిలీలు..ఎండీ వల్లూరు క్రాంతి ఉత్తర్వులు

టూరిజం శాఖలో ఆఫీసర్ల బదిలీలు..ఎండీ వల్లూరు క్రాంతి ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థలో ఆఫీసర్ల బదిలీలు జరిగాయి. పరిపాలనా సౌలభ్యం, పనిలో సామర్థ్యం పెంచేందుకు ముగ్గురు అధికారులను బదిలీ చేస్తూ సంస్థ ఎండీ  వల్లూరు క్రాంతి ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ పెంచడంతోపాటు సర్వీస్ డెలివరీని మెరుగుపరచడానికే ఈ మార్పులు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ టీయూలో ఉన్న డిప్యూటీ మేనేజర్ వై. రాజలింగాన్ని హైదరాబాద్ దుర్గం చెరువు ఎకో-టూరిజం విభాగానికి బదిలీ చేశారు. హైదరాబాద్ సీఆర్వోలో ఉన్న డిప్యూటీ మేనేజర్ జి. వెంకటస్వామిని  సికింద్రాబాద్ టీయూ యూనిట్ మేనేజర్‍గా పంపించారు. 

కార్పొరేట్ ఆఫీసు ప్రాజెక్ట్స్ వింగ్‍లో ఉన్న అసిస్టెంట్ మేనేజర్​ఆర్.కె రాజును  సీఆర్వో  ఇన్​చార్జ్ గా నియమించారు. బదిలీ అయిన అధికారులు వెంటనే కొత్త పోస్టింగుల్లో రిపోర్ట్ చేయాలని, పాత బకాయిలు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుని బాధ్యతలు అప్పగించాలని ఎండీ కాంత్రి ఆదేశించారు.