మేరీలాండ్‌లో ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహం ఆవిష్కరణ

మేరీలాండ్‌లో ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహం ఆవిష్కరణ

అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఉత్తర అమెరికాలోని మేరీలాండ్‌లో ఆవిష్కరించారు. ‘స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ ’ పేరుతో 13 ఎకరాల స్థలంలో  19 అడుగుల విగ్రహాన్ని నిర్మించారు. అంబేడ్కర్‌ బుద్ధిజం స్వీకరించిన అక్టోబర్‌ 14న మేరీలాండ్‌లోని ఎకోకీక్‌ నగరంలో ఆవిష్కరించారు. ఇది సమానత్వానికి, మానవ హక్కులకు చిహ్నంగా నిలుస్తుందని ‘అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌’ పేర్కొంది. గుజరాత్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని రూపొందించిన ప్రముఖ శిల్పి రామ్‌ సుతర్‌ ఈ విగ్రహాన్ని తయారు చేయడం విశేషం. 

దాదాపు 500 మంది విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైనట్లు అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ తెలిపింది. 13 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాంగణంలో గ్రంథాలయం, కన్వెన్షన్‌ సెంటర్‌, బుద్ధ గార్డెన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడిచింది. ఈ కార్యక్రమానికి భారత్‌ నుంచి ‘దళిత్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ’ అధ్యక్షుడు నర్రా రవి కుమార్‌ హాజరయ్యారు. 

Also Read :- ఇజ్రాయిల్ పీఎం ఒక దెయ్యం.. గాజాకు మోదీ అండగా నిలవాలన్న ఓవైసీ