ఆగిపోయిన గుండెకు ఊపిరిపోసిన అంబులెన్స్ సిబ్బంది

ఆగిపోయిన గుండెకు ఊపిరిపోసిన అంబులెన్స్ సిబ్బంది

కరీంనగర్: ఆగిపోయిన గుండెకు అంబులెన్స్ సిబ్బంది మళ్లీ ఊపిరి పోసి ఓ ప్రాణం నిలిపిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వైద్యులు నడిచే దేవుళ్లు అనే పదానికి నిర్వచనంలో వైద్యులే కాదు వైద్య సిబ్బందితోపాటు అంబులెన్స్ సిబ్బందికి కూడా కల్పించేలా ప్రేరణ కల్పించిందీ ఘటన. వివరాలు ఇలా ఉన్నాయి.
మంథని మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన సుజాత అనే మహిళకు మూడు రోజుల క్రితం మగ పిల్లవాడు జన్మించాడు. పుట్టిన తర్వాత హుషారుగా లేకపోవడంతో వైద్యులు అబ్జర్వేషన్లో ఉంచారు. బాబుకు అనారోగ్యం కారణంగా నిన్న కరీంనగర్ సివిల్  ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో అంబులెన్సులో వరంగల్ కు తరలిస్తుండగా పసికందులో కదలిక కనిపించలేదు. గుండె ఆగిపోయినట్లు గుర్తించారు. అంబులెన్స్ సిబ్బంది నిరాశకు గురికాకుండా వెంటనే స్పందించి చెస్ట్ కంప్రెషన్ విధానంలో మళ్లీ గుండె ను కొట్టుకునేలా చేసేందుకు ప్రయత్నించారు. కొద్దిసేపటికే వారి ప్రయత్నం ఫలించింది. చిన్నారి గుండె తిరిగి పనిచేసింది. దీంతో చిన్నారి తల్లి ఆనందంతో కంటతడిపెట్టుకుంది. చనిపోయాడనుకున్న నా బిడ్డకు మళ్లీ ప్రాణం పోశారంటూ అంబులెన్స్ సిబ్బందికి ఆనంద భాష్పాలతో కృతజ్ఘతలు తెలిపింది.