ఆరు కిలోమీటర్లకు రూ. 9,200 డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్

ఆరు కిలోమీటర్లకు రూ. 9,200 డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్

ఆరు కిలోమీటర్ల దూరానికి కరోనా పేషంట్ తల్లిదండ్రుల నుంచి రూ. 9200 డిమాండ్ చేసిన ఘటన బెంగాల్ లో జరిగింది. హుగ్లీకి చెందిన తొమ్మది నెలల బాబు మరియు 9 సంవత్సరాల బాబు కరోనా బారినపడ్డారు. వారిని ఇన్సిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ల్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే పిల్లలను రాష్ట్ర కోవిడ్ ఆస్పత్రి అయిన కోల్‌కతా మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు పిల్లల తండ్రికి సూచించారు. దాంతో ఆ తండ్రి హాస్పిటల్ బయట ఉన్న ఒక అంబులెన్స్ లోకి వారిని ఎక్కించాడు. కేఎంసీహెచ్ దగ్గరికి తీసుకెళ్లాలని కోరాడు. దానికి ఆ డ్రైవర్ రూ. 9200 డిమాండ్ చేశాడు. ఐసీహెచ్ నుంచి కేంఎంసీహెచ్ వరకు కేవలం ఆరు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఆ తండ్రి అంత డబ్బు ఇవ్వలేనని ప్రాధేయపడ్డాడు. అయినా కూడా డ్రైవర్ కనికరించలేదు. పైగా.. బాలుడికి పెట్టిన ఆక్సీజన్ ను తొలగించి.. పిల్లలను, వారి తల్లిని అంబులెన్స్ నుంచి కిందికి దించాడు. విషయం తెలిసిన ఐసీహెచ్ వైద్యులు కలుగజేసుకొని డ్రైవర్ తో మాట్లాడటంతో చివరికి రూ. 2000లకు తీసుకెళ్లాడు.

‘ఐసీహెచ్ వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారి కారణంగానే నా పిల్లలను మెరుగైన చికిత్స కోసం కెఎంసీహెచ్‌కు తీసుకెళ్లగలిగాను. అసలే కరోనా వచ్చి బాధలో ఉన్నవాళ్లను ఇలా డబ్బుల కోసం వేధించడం కరెక్ట్ కాదు’అని ఆ పిల్లల తండ్రి అన్నాడు. కేవలం 6 కిలోమీటర్ల దూరానికి కూడా డ్రైవర్ అంత డబ్బు డిమాండ్ చేశాడంటే.. కరోనా పేషంట్లను అందరూ ఎలా దోచుకుంటున్నారో అర్థమవుతుంది.

For More News..

జాబ్ పోతుందనే భయంతో కుటుంబంతో సహా ఆత్మహత్య

కరోనాను జయించిన 101 ఏళ్ల మంగమ్మ

దేశంలో కొన్నిచోట్ల మళ్లీ లాక్‌డౌన్