తుంగతుర్తి, వెలుగు: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మందుల సామేల్అన్నారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో 124 మంది రైతులకు సబ్బిడీ వ్యవసాయ పనిముట్లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే రైతుకు బీఆర్ఎస్హయాంలో పనిముట్లు అందలేదని ఆరోపించారు. కాంగ్రెస్అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంలో రైతులకు చేయూతనిస్తోందని పేర్కొన్నారు.
ప్రతీ సీజన్లో ఒకే రకమైన పంటలు కాకుండా పంట మార్పిడి పద్ధతి పాటించాలని చెప్పారు. ప్రస్తుతం వరి కన్నా జొన్నలకు ఎక్కువ డిమాండ్ ఉందని, జొన్న, సజ్జ పంటలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీఏ రమేశ్‌బాబు, ఎంపీడీవో శేషు కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ వెంకన్న, సర్పంచ్ సాయిబాబు, డీటీ కంటమయ్య, కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్, సైదులు పాల్గొన్నారు..
