చిట్టి చిట్టి రోబో.. నా జట్టు కట్టు రోబో.. సూపర్‌స్టార్ రజనీకాంత్సినిమా ‘రోబో’లోని ఈ పాటను అందరూ చూసే ఉంటారు. ఇంకొద్ది రోజుల్లో నిజంగా అలాంటి రోబోలను మనం చూడబోతున్నాం. మనిషి రూపంతో, మనిషిలాగే హావభావాలు పలికించే ఆడ రోబో ‘అమెకా’ మనల్ని పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ రోబో అమ్మాయి ‘అమెకా’ కనురెప్పలు ఆర్పుతూ తన చేతుల్ని, వేళ్లను పరికించి చూసుకుంటున్న వీడియోను ఆన్లైన్లో రివీల్ చేశారు యూకే సైంటిస్టులు. ఇంతకు ముందు 2016లో రూపొందించిన సోఫియా కంటే ఈ రోబో ఇంటెలిజెంట్‌గా పనిచేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. సోఫియా తలతిప్పి చూసేది, మాట్లాడేది కూడా. ఆ తర్వాత హాంకాంగ్ కంపెనీ హాన్సన్ రోబోటిక్స్ రూపొందించిన హ్యూమనాయిడ్ రోబోట్ చాట్ చేస్తూ కొంటెగా నవ్వుతూ జోకులు కూడా చెప్పింది. 2017లో సౌదీ అరేబియాలో ఈ రోబోకు సిటిజన్‌షిప్ రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే వీటన్నిటినీ మించి ‘అమెకా’ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో తయారవుతోందని అంటున్నారు రీసెర్చర్స్. ఇంకాస్త మెరుగైన కదలికలు, హావభావాలతో అందర్నీ ఆశ్యరపరుస్తున్న ఈ ‘అమెకా’ ప్రపంచంలోని అత్యంత అధునాతనమైన ‘హ్యూమనాయిడ్ రోబోట్’ అని చెప్పొచ్చు. ఆర్టిఫీషియల్ హ్యూమన్ బాడీతో ఉన్న ఈ రోబోను పవర్‌ఫుల్ ట్రిటియం రోబోట్ ఆపరేటింగ్ సిస్టంతో ఆపరేట్ చేస్తారు. బ్రిటన్‌కు చెందిన ఇంజినీర్డ్ ఆర్ట్స్ ఈ రోబో డిజైన్ ను సిద్ధం చేసింది. డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉన్న ఈ రోబో ఖర్చు మాత్రం మిలియన్స్‌లోనే ఉంటుందట.
