సింక్​లో స్నానం చేశాడు : రెస్టారెంట్​ కిచెన్​లో ఉద్యోగి జలకాలాట

సింక్​లో స్నానం చేశాడు : రెస్టారెంట్​ కిచెన్​లో ఉద్యోగి జలకాలాట

అది అమెరికాలోని ఫ్లోరిడా. అక్కడ ఒక ఫేమస్​ ఫాస్ట్​ ఫుడ్​ రెస్టారెంట్​ ఉంది. వెండీ దాని పేరు. ఆ ఫేమస్​ రెస్టారెంట్​ను ఇంకా ఫేమస్​ చేయాలనుకున్నాడో ఏమోగానీ.. ఆ రెస్టారెంట్​ ఉద్యోగి ఒకడు కిచెన్​లోని సింక్​లో స్నానం చేశాడు. చేయడం కాదు, తాను చేసింది అంత ఘనకార్యమనుకున్నాడు కావొచ్చు.. ఫోన్లో వీడియో కూడా తీశాడు. పక్కనే ఉన్న ఇతర ఉద్యోగులు ఆ పనిని ఆపాల్సింది పోయి ఇంకా రెచ్చగొట్టారు. ఫకఫకమని నవ్వారు.

మరి, ఆ వీడియోను అతడే పోస్ట్  చేశాడో, ఉద్యోగుల్లో ఇంకెవరైనా పోస్ట్​ చేశారో కానీ, ఆ వీడియో ఫేస్​బుక్​లో వైరల్​ అయింది. ఒక్క వారంలోనే పది లక్షల మందికిపైగా ఆ వీడియోను చూశారు. ఆ రెస్టారెంట్​కు వెళ్లే చాలా మంది బహిరంగంగా వెండీపై విమర్శలు కురిపించారు. ఫేమస్​ అనుకుంటే ఇలాగా చేసేదంటూ యాజమాన్యంపై మండిపడ్డారు. దీంతో గత్యంతరం లేక ఆ రెస్టారెంట్​ ఓనర్​ మీడియా సమక్షంలో వివరణ ఇచ్చారు. అతడిని ఉద్యోగం నుంచి పీకేసినట్టు చెప్పారు. ఇలాంటి వాటిని క్షమించబోమన్నారు.