థ్యాంక్యూ ఇండియా.. థ్యాంక్యూ మోడీ!

థ్యాంక్యూ ఇండియా.. థ్యాంక్యూ మోడీ!
  • అమెరికా, డబ్ల్యూహెచ్‌‌వో థ్యాంక్స్

న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో వివిధ దేశాలకు వ్యాక్సిన్లు పంపుతూ సహకరిస్తున్న మన దేశానికి, ప్రధాని మోడీకి డబ్ల్యూహెచ్​వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ థ్యాంక్స్ చెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా కరోనా నివారణకు సహాయం చేస్తున్నందుకు ఇండియాకు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్రమోడీకి థ్యాంక్స్. మనం కలిసికట్టుగా పనిచేసినప్పుడు మాత్రమే వైరస్​ను అంతంచేసి ప్రజల ప్రాణాలను, జీవనాధారాలను కాపాడగలం’’ అని ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు.

ఇండియా.. ‘ట్రూ ఫ్రెండ్’: అమెరికా

ప్రపంచ మానవాళిని కాపాడేందుకు ఇండియా తన ఫార్మస్యూటికల్ సెక్టార్ ద్వారా సహాయం చేస్తుండటంపై అమెరికా కూడా హర్షం వ్యక్తం చేసింది. ఆయా దేశాలకు ఇండియా నిజమైన నేస్తమని ప్రశంసించింది. గ్లోబల్ హెల్త్ పరిరక్షణలో మనదేశం పాత్ర చాలా గొప్పదని ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ‘ఇప్పటికే బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మాల్దీవులకు ఇండియా 32 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపింది. బ్రెజిల్, మొరాకో దేశాలకు మరో 20 లక్షల డోసులు పంపింది’ అని మెచ్చుకుంది.

For More News..

ట్రాక్టర్ ర్యాలీకి పోలీసుల పర్మిషన్!

కేసీఆర్‌‌ అంటే.. ‘కిలాడి చంద్రశేఖర రావు’