హనుమంతుడు నకిలీ దేవుడంట..! అమెరికన్ లీడర్ వివాదాస్పద వ్యాఖ్యలు

హనుమంతుడు నకిలీ దేవుడంట..! అమెరికన్ లీడర్ వివాదాస్పద వ్యాఖ్యలు

వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌: హిందూ దేవుళ్లను కించపరుస్తూ అమెరికాలోని అధికార పార్టీ రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్‌‌‌‌‌‌‌‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టెక్సస్‌‎లోని షుగర్ ల్యాండ్ టౌన్‌‎లో నిర్మించిన భారీ హనుమంతుడి విగ్రహంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘మనది క్రైస్తవ దేశం. టెక్సస్‌‎లో ఒక నకిలీ హిందూ దేవుడి నకిలీ విగ్రహాన్ని మనం ఎందుకు అనుమతిస్తున్నాం?” అంటూ ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌’లో పోస్టు చేశారు. 

మరో పోస్టులో ‘‘మీకు నేను తప్ప మరో దేవుడు లేడు. మీరు మరే విగ్రహాన్ని, చిత్రాన్ని పూజించవద్దు’ అంటూ బైబిల్‌‎లోని వాక్యాలను ఉటంకించారు. ఈ పోస్టులకు హనుమంతుడి విగ్రహం వీడియోను జత చేశారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆయన హిందూ వ్యతిరేక, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని హిందూ అమెరికన్ ఫౌండేషన్  ఆగ్రహం వ్యక్తం చేసింది. డంకన్‌‌‏పై చర్యలు తీసుకోవాలని రిపబ్లికన్ పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసింది.