చిరుతపులి భయంతో బోనులో ఉంటున్న రైతు

చిరుతపులి భయంతో బోనులో ఉంటున్న రైతు

చిరుతపులి దాడి భయంతో గుజరాత్‌లోని ఆరావళి జిల్లాలో ఓ రైతు ఐరన్ కేజ్లో గడుపుతున్నారు. భట్‌కోట గ్రామంలోని గుడి సమీపంలోని పొలాల్లో గత కొన్ని రోజులుగా చిరుతలు సంచరిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో గ్రామంలోకి చిరుతలు వచ్చి చంపేస్తాయనే భయంతో గ్రామస్థులు కాపలా కాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ రైతు ఇనుప పంజరం లాంటి ఓ బోనును ఏర్పాటుచేసుకొని, రాత్రిళ్లు అందులోనే పడుకుంటున్నాడు. ఇటీవల భట్‌కోటా, రామేశ్వర్‌ కంపా, గోఖర్వా, శాంపూర్‌ సర్దోయ్‌, లాల్‌పూర్‌తో సహా 15కు పైగా గ్రామీణ ప్రాంతాల్లో చిరుత పులుల భీభత్సం ఆ ప్రాంతమంతా భయాందోళనలకు గురి చేసింది. ఈ చిరుతలు మనుషులను వేటాడి నరమాంస భక్షకులుగా మార్చకముందే అటవీశాఖ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.