‌‌లాక్‌డౌన్‌ బోర్‌‌ కొట్టకుండా.. క్విజ్‌ కాంపిటీషన్‌

‌‌లాక్‌డౌన్‌ బోర్‌‌ కొట్టకుండా.. క్విజ్‌ కాంపిటీషన్‌
  • ఆన్‌లైన్‌లో స్టార్ట్‌ చేసిన బీహార్‌‌ ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌
  • గెలిచోనళ్లకు ప్రైజ్‌, సర్టిఫికెట్లు

పాట్నా: లాక్‌డౌన్‌ వేళ ఇంట్లో ఉండే వారికి బోర్‌‌ కొట్టకుండా.. ఎవరూ బయటకు రాకుండా బీహార్‌‌ ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సరికొత్త ఆలోచన చేసింది. ఆన్‌లైన్‌ క్విజ్‌ కాంటెస్ట్‌ మొదలు పెట్టి.. ఆన్సర్లు చెప్పిన వారికి గిఫ్టులు, సర్టిఫికెట్లు ఇస్తోంది. ఈ లాక్‌డౌన్‌లో బీహార్‌‌ ఎన్విరాన్‌మెంట్‌, జంతు సంపద లాంటి వివరాలపై కూడా ప్రజలకు అవగాహన కలుగుతుందని క్లైమెట్‌ ఛేంజ్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దీపక్‌కుమార్‌‌ సింగ్‌ చెప్పారు. ప్రజలను బయటకు రాకుండా ఇంట్లో ఉంచడమే ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు. “ ముందు ప్రజలను ఎంటర్‌‌టైన్‌ చేసేందుకు దీన్ని స్టార్ట్‌ చేశాం. ఆ తర్వాత దాన్ని కాంపిటిషన్‌గా మార్చాం” అని దీపక్‌ కుమార్‌‌ అన్నారు.ఈ క్విజ్‌లో పాల్గొనాలనుకునే వారు ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌‌ అకౌంట్లు చూడాలని సూచించారు. లాక్‌డౌన్‌ కొనసాగిన్నని రోజులు దీన్ని కంటిన్యూ చేస్తామన్నారు.