డంప్ యార్డును తొలగించండి : అధ్యక్షుడు ఆకుల తిరుమల్ రెడ్డి

డంప్ యార్డును తొలగించండి : అధ్యక్షుడు ఆకుల తిరుమల్ రెడ్డి
  •     సైబరాబాద్​ మున్సిపల్​ కమిషనర్ కు వినతి

అమీన్​పూర్, వెలుగు: అమీన్​పూర్​ సర్కిల్​ పరిధిలోని కాలనీలు, నివాసాల మధ్య ఉన్న డంప్​యార్డును తొలగించాలని అమీన్​పూర్​ పీపుల్స్​అసోసియేషన్​అధ్యక్షుడు ఆకుల తిరుమల్​ రెడ్డి సైబరాబాద్​ మున్సిపల్​ కమిషనర్​ సృజనను కోరారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా కమిషనర్​ను అసోసియేషన్​ సభ్యులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. డంప్​యార్డు వల్ల చెడు వాసన వస్తుండడంతో ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. 

నేషనల్​హైవే నుంచి అమీన్​పూర్​ వరకు రోడ్డు విస్తరణ చేపట్టాలని కోరగా భూసేకరణ పూర్తైన వెంటనే పనులు ప్రారంభిస్తామని కమిషనర్​ చెప్పినట్లు తిరుమల్​ రెడ్డి పేర్కొన్నారు. అమీన్​పూర్​ పెద్ద చెరువులో డ్రైనేజీ చేరుతుండడంతో చెరువు తన స్వభావాన్ని కోల్పోతున్నదని, తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కమిషనర్​ను కోరారు. ఆయన వెంట కార్యదర్శి నరేశ్​బాబు, ఆర్గనైజింగ్​ సెక్రటరీ రామ్​చందర్​ పాల్గొన్నారు.