సెక్యూరిటీ లోపాలను సరిదిద్దుకోవాలె

సెక్యూరిటీ లోపాలను సరిదిద్దుకోవాలె

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో వామపక్ష తీవ్రవాదంపై సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో నక్సలైట్ ప్రభావిత ఆరు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, బిహార్ సీఎం నితీశ్ కుమార్, శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), ఉద్ధవ్ థాక్రే (మహారాష్ట్ర), హేమంత్ సోరెన్ (ఝార్ఖండ్)తోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ సమీక్షలో ఆయా రాష్ట్రాల్లో సెక్యూరిటీ పరిస్థితులు, అభివృద్ధి ప్రాజెక్టుల అమలు గురించి అమిత్ షా చర్చించారు.  

టెలికం సెక్టార్ పనులను వేగవంతం చేయాలె

నాలుగేళ్లలో నక్సల్స్ ప్రభావం తగ్గిందని.. హోం శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్ల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఆపరేషన్లు, భద్రతా పరమైన లోపాలను సరిదిద్దుకోవడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో టెలికం సెక్టార్‌‌కు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అమిత్ షాను సీఎంలు కోరారు.

ఈ సమీక్షకు రావాల్సిందిగా పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్ర ప్రదేశ్, కేరళ రాష్ట్రాల సీఎంలను కూడా కేంద్రం ఆహ్వానించింది. కానీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆ రాష్ట్రాల నుంచి కొందరు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, గిరిరాజ్ సింగ్, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్, కేంద్ర హోం సెక్రటరీ అజయ్ భల్లా, డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో అరవింద్ కుమార్ కూడా పాల్గొన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

పవన్.. అన్నింటికీ సమాధానం చెప్తా.. మంచు విష్ణుకు ఓటెయ్

మోడీజీ.. నేనూ హిందువునే.. నన్నెందుకు అనుమతించరు?

సోనియా గాంధీ ప్రధానైతే తప్పేంటి?

జగన్ గారూ.. రాజకీయాలు పక్కనపెట్టి సినీ ఇండస్ట్రీని కాపాడండి