సోనియా గాంధీ ప్రధానైతే తప్పేంటి?

సోనియా గాంధీ ప్రధానైతే తప్పేంటి?

న్యూఢిల్లీ: ఒక దేశ ప్రధాని కావడానికి విదేశీ మూలాలు ఉండటానికి సంబంధమే లేదని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలె అన్నారు. భారత మూలాలు కలిగిన కమలా హ్యారిస్ అగ్రరాజ్యమైన అమెరికాకు వైస్ ప్రెసిడెంట్‌ అయ్యారని.. అలాంటప్పుడు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ దేశానికి ప్రధాని అవ్వడంలో తప్పేం లేదన్నారు. యూపీఏ 2004లో అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ ప్రధాని అవ్వాల్సిందన్నారు.

‘యూపీఏ పవర్‌లోకి వచ్చినప్పుడు సోనియా ప్రధాని అవ్వాల్సింది. కమలా హ్యారిస్ యూఎస్‌కు వైస్ ప్రెసిడెంట్ అవ్వగలిగినప్పుడు.. సోనియా గాంధీ ఎందుకు ప్రధాని కాలేరు? సోనియా భారత పౌరురాలు. ఆమె మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్య. అలాగే లోక్‌సభ సభ్యురాలు కూడా అని గుర్తుంచుకోవాలి’ అని అథవాలె పేర్కొన్నారు. 2004లో యూపీఏ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో సోనియా ప్రధాని అవ్వాలని తాను ప్రతిపాదించానన్నారు. అప్పట్లో శరద్ పవార్ పీఎం అయ్యుంటే కాంగ్రెస్ మరింత బలపడి ఉండేదని, ఇంతలా బలహీనపడేది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తల కోసం:

పవన్.. అన్నింటికీ సమాధానం చెప్తా.. మంచు విష్ణుకు ఓటెయ్

బెదిరింపులు వచ్చినా మేం భారత్‌కు వెళ్లినం

జగన్ గారూ.. రాజకీయాలు పక్కనపెట్టి సినీ ఇండస్ట్రీని కాపాడండి

మోడీజీ.. నేనూ హిందువునే.. నన్నెందుకు అనుమతించరు?