మోడీజీ.. నేనూ హిందువునే.. నన్నెందుకు అనుమతించరు?

మోడీజీ.. నేనూ హిందువునే.. నన్నెందుకు అనుమతించరు?

కోల్‌కతా: వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్‌కు వెళ్లేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి విదేశాంగ శాఖ అనుమతివ్వలేదు. అది ఒక ముఖ్యమంత్రి పాల్గొనే ఈవెంట్ కాదని విదేశాంగ శాఖ  పేర్కొంది. అక్టోబర్​లో ఇటలీలో జరగనున్న ఈ కాన్ఫరెన్స్‌లో పోప్ ఫ్రాన్సిస్, జర్మనీ చాన్స్‌‌లర్ ఏంజెలా మెర్కెల్, ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి పాల్గొననున్నారు. ఈ విషయంపై దీదీ స్పందించారు. తాను ఇటలీ వెళ్లేందుకు కేంద్రం నో చెప్పడంపై మమత ఫైర్ అయ్యారు. తానంటే మోడీ సర్కార్‌కు అసూయ, ఈర్ష్య అని దీదీ అన్నారు. ఇటలీ తనకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చిందని.. కానీ కేంద్రం క్లియరెన్స్ ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు. ‘నన్నెవరూ ఆపలేరు. విదేశాలను చుట్టేయాలని నాకు కోరిక లేదు. కానీ ఇది మన దేశ గౌరవానికి సంబంధించిన విషయం. మోడీజీ మీరు హిందువుల గురించి మాట్లాడతారు. నేను కూడా హిందూ మహిళనే కదా! నన్నెందుకు అనుమతించరు మరి? మీకు నాపై అసూయ’ అని దీదీ చెప్పారు.

మరిన్ని వార్తల కోసం:

పవన్.. అన్నింటికీ సమాధానం చెప్తా.. మంచు విష్ణుకు ఓటెయ్

బెదిరింపులు వచ్చినా మేం భారత్‌కు వెళ్లినం

జగన్ గారూ.. రాజకీయాలు పక్కనపెట్టి సినీ ఇండస్ట్రీని కాపాడండి