బెదిరింపులు వచ్చినా మేం భారత్‌కు వెళ్లినం

V6 Velugu Posted on Sep 26, 2021

న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు పాకిస్థాన్ టూర్ నుంచి వైదొలిగాయి. సిరీస్ ఆడటం కోసం పాక్‌కు వెళ్లిన కివీస్ టీమ్.. భద్రతా కారణాల రీత్యా సిరీస్‌ను రద్దు చేసుకుంది. ఇంగ్లండ్ కూడా సెక్యూరిటీ కారణాలను చూపుతూ పాక్ టూర్‌ను క్యాన్సిల్ చేసుకుంది. దీంతో ఆ న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లపై పాక్ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి నుంచి ఏ దేశంతోనైనా ఆడాలా వద్దే అనే అంశంపై తాము కూడా కఠినంగా వ్యవహరిస్తామని పాక్ సీనియర్లు అంటున్నారు. ఇది తనను తీవ్రంగా నిరుత్సాహపర్చిందని పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ అన్నాడు. ముఖ్యంగా కివీస్ తమతో వ్యవహరించిన తీరును ఎప్పటికీ మరువలేనన్నాడు. 

‘టూర్‌లను ఏర్పాటు చేయడం వెనుక ఎంతో శ్రమ దాగి ఉంటుంది. పర్యాటక దేశాల సభ్యులు పలు పరిశీలనలు, విచారణ చేస్తారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాకే సిరీస్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ దక్కుతుంది. న్యూజిలాండ్ క్రికెటర్లకు పాకిస్థాన్‌లో మంచి ఆదరణ, స్వాగతం లభించింది. కానీ వాళ్లు మాతో వ్యవహరించిన దాన్ని ఎప్పటికీ మర్చిపోం. ఒకవేళ కివీస్ టీమ్‌కు ఏమైనా బెదిరింపులు వచ్చినా, ముప్పు ఉందని అనిపిస్తే ఆ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో చర్చించాల్సింది. పాకిస్థాన్ భద్రతా దళాలు పరిస్థితులను అంచనా వేసే వరకు వేచి ఉండాల్సింది. మా దేశం అంటే మాకూ గర్వకారణమే. ఈ విషయం అందరికీ తెలిసేలా మేం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. అన్ని క్రికెట్ దేశాలు భారత్ దారిలో నడుస్తూ అవే తప్పులు చేస్తున్నాయి. ఒక సమయంలో భారత్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మాకు బెదిరింపులు వచ్చాయి. అయినా మమ్మల్ని అక్కడకు పంపింది. మేం కూడా వెళ్లాం. ఇంగ్లండ్‌లో కూడా కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అయినా అక్కడ క్రికెట్ జరుగుతోంది. తప్పుడు ఈమెయిల్స్‌ను నమ్మి టూర్లను రద్దు చేసుకోవడం సరికాదు’ అని అఫ్రిదీ పేర్కొన్నాడు. 

మరిన్ని వార్తల కోసం: 

పవన్.. అన్నింటికీ సమాధానం చెప్తా.. మంచు విష్ణుకు ఓటెయ్

పండుగలు వస్తున్నయ్.. కొవిడ్ రూల్స్ తప్పక పాటించాలె

జగన్ గారూ.. రాజకీయాలు పక్కనపెట్టి సినీ ఇండస్ట్రీని కాపాడండి

Tagged Team india, India, england, Pakistan, New Zealand, Shahid afridi

Latest Videos

Subscribe Now

More News