
న్యూఢిల్లీ: నేషనల్ డాక్టర్స్‌డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వైద్యులు, ఇతర సిబ్బందికి విషెష్ చెప్పారు. కరోనాపై చేస్తున్న పోరాటంలో డాక్టర్లదే కీలక పాత్ర అని ఆయన కొనియాడారు. వారి జీవితాల్ని పణంగాపెట్టి మనల్ని కాపాడుతున్నారని చెప్పారు. ‘తల్లి బిడ్డకు జన్మనిస్తే..అదే బిడ్డకు వైద్యులు పునర్జన్మని ఇస్తారు” అని అన్నారు. అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్‌డే పురస్కరించుకుని దేశంలోని సీఏలందరికి మోడీ విషెస్ చెప్పారు. దేశ ఉజ్వల ఆర్థిక భవిష్యత్తు సీఏల చేతిలోనే ఉందంటూ వారి బాధ్యతను గుర్తు చేశారు.
అమిత్ షా విషెస్
డాక్టర్స్ డే సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా విష్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “ కరోనా కష్టకాలంలో ముందుండి పోరాడుతున్న డాక్టర్లకు నేను సెల్యూట్ చేస్తున్నాను. ఈ టైంలో వాళ్లు చేస్తున్న సేవలకు దేశం అంతావాళ్లకు సెల్యూట్ చేస్తోంది” అని షా ట్వీట్ చేశారు. సీఏలకు కూడాషా విషెస్ చెప్పారు.
India salutes our doctors- exceptional care givers who are at the forefront of a spirited fight against COVID-19. #doctorsday2020 pic.twitter.com/WsWroXjVpO
— Narendra Modi (@narendramodi) July 1, 2020