కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనపై కొట్లాడండి

 కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనపై కొట్లాడండి
  • ప్రతి కార్యకర్త ఇంట్లో నేనుంట
  • కేసీఆర్ ప్రజావ్యతిరేక పాలనపై ధైర్యంగా కొట్లాడండి: అమిత్ షా
  • ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న షా
  • దళిత కార్యకర్త ఇంటికి వెళ్లి మాట్లాడిన కేంద్ర హోం మంత్రి
  •  

సికింద్రాబాద్, వెలుగు: ‘‘ప్రతి కార్యకర్త ఇంట్లో నేనుంటా.. మీరంతా ధైర్యంగా కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనపై కొట్లాడండి’’ అని బీజేపీ కార్యకర్తలకు అమిత్‌‌‌‌‌‌‌‌ షా పిలుపునిచ్చారు. మును గోడు సభ కోసం ఆదివారం మధ్యాహ్నం 2.10 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరు కుని, అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత సాంబమూర్తినగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీజేపీ దళిత కార్యకర్త ఎన్.సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి యోగ క్షేమాలడిగి తెలుసుకున్నారు. 

  • అక్కడ 15 నిమిషాలున్నారు. 
  • అక్రమ కేసులు పెట్టారు:
  •  అమిత్​ షాతో సత్యనారాయణ

‘‘30 ఏండ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నా. మీ అంత గొప్ప నాయకుడు నాలాంటి సామాన్య కార్యకర్త ఇంటికి రావడం నా అదృష్టం. మరింత కష్టపడి పని చేస్తా” అని అమిత్ షాతో సత్యనారాయణ చెప్పారు. ‘‘సార్.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 8 ఏండ్లుగా దళితులను దారుణంగా మోసం చేశారు. దళితులకు మూడెకరాల భూ మి ఇస్తానన్న హామీ అమలు కాలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో లబ్ధి పొందాలని తెచ్చిన దళిత బంధు పథకాన్ని పూర్తిగా నీరుగార్చారు. కేసీఆర్ దురాగతాలపై పోరాటం చేసిన నాపై అక్రమంగా కేసులు నమోదు చేసి, వేధించారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత కిషన్ రెడ్డి, సంజయ్, తరుణ్ చుగ్‌‌‌‌‌‌‌‌లతో 
కలిసి బేగంపేట రమదా మనోహర హోటల్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నారు. రైతు సంఘాల నేతలతో క్లోస్ డోర్ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్నారు. అది పూర్తయ్యాక బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి మునుగోడుకు ఆర్మీ హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బయల్దేరి వెళ్లారు.