రాహుల్, మమతా లకు అమిత్ షా సవాల్

రాహుల్, మమతా లకు అమిత్ షా సవాల్

CAAతో ఎవరి పౌరసత్వం పోదని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో CAAకు మద్దతుగా నిర్వహించిన సభలో అమిత్ షా పాల్గొన్నారు. పౌరసత్వం తొలగించేలా ఉన్న ఒక్క ప్రొవిజన్ అయినా చూపించగలరా..? అని రాహుల్ గాంధీ, మమతా బెనర్జీలను సవాల్ చేశారు అమిత్ షా. పాకిస్థాన్‌ దేశాల్లో అణచివేతకు గురై, అక్కడి నుంచి వచ్చే ప్రతి శరణార్థికి భారతీయ పౌరసత్వం లభించే వరకు తాము మౌనంగా కూర్చోబోమని చెప్పారు. భారతదేశంపై మీకు, మాకు ఉన్నంత అధికారం, పాకిస్థాన్ నుంచి వచ్చే హిందూ, క్రైస్తవ, బౌద్ధ, సిక్కు, జైన, పారశీక శరణార్థులకు కూడా ఉందని చెప్పారు.