హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా

హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా

కేంద్ర  హోంమంత్రిగా  బాధ్యతలు  చేపట్టాక  తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు. ఎయిర్ పోర్టులో CISF అధికారులతో సమావేశం అవుతారు. ఆతర్వాత బీజేపీ  సభ్యత్వ నమోదు  కార్యక్రమాన్ని శంషాబాద్ లో ప్రారంభిస్తారు. పహడిషరీఫ్ లోని  రంగనాయక తాండాలో ఓ గిరిజన  కుటుంబానికి పార్టీ సభ్యత్వం ఇస్తారు. ఈ సందర్భంగా వారితో కొద్దిసేపు మాట్లాడనున్నారు అమిత్ షా.

అక్కడి నుంచి  సాయంత్రం  నాలుగున్నరకు  శంషాబాద్ లోని  KLCC ఫంక్షన్ హాల్లో  ఏర్పాటు చేసిన  పార్టీ   సభ్యత్వ కార్యక్రమంలో  పాల్గొంటారు. రాత్రి 7 గంటల  15 నిమిశాలకు  పార్టీ  ముఖ్య నేతలతో  ప్రత్యేకంగా  సమావేశం అవుతారు.  ఈ సందర్భంగా  రాష్ట్రంలో  పార్టీ బలోపేతం  కోసం అనుసరించాల్సిన  విధానాలపై  చర్చిస్తారు. నాలుగు  ఎంపీలు  గెలవడంతో ఉత్సాహంతో   ఉన్న బిజెపి  నేతలు… అమిత్ షా  రాకతో  పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం  మరింత  రెట్టింపు  అవుతుందని  చెప్తున్నారు.