నల్లగొండ జిల్లా వేములపల్లిలో దారుణం జరిగింది. మేత మేస్తూ అకస్మాత్తుగా సుమారు 140 గొర్రెలు మృతి చెందాయి. పొలంలో గొర్రెలు ఎక్కడిక్కడ ఉన్నచోటనే మృత్యువాత పడ్డాయి. చనిపోయిన గొర్రెలు సూర్యాపేట జిల్లా పెనుపాడు మండలం అనంతారం, అన్నారం, దోసపాడు గొర్రెల కాపరులకు చెందినవి.
నవంబర్ 6న పొలంలో మేత మేస్తుండగా..గొర్రెలన్నీ ఒక్కసారిగా ఉన్నచోటనే చనిపోయాయి. ఈ ఘటనలో గొర్రెల కాపరులు ఆందోళన చెందారు..ఒక్కొక్కటిగా చూస్తుండగానే 140 గొర్రెలు చనిపోవడంతో లబోదిబోమంటున్నారు.
ఘటనా స్థలానికి వచ్చిన పశుసంవర్ధక శాఖ అధికారులు మృతి చెందిన గొర్రెలను పరిశీలించారు. విష ఆహారం తినడం వల్లనే గొర్రెలు మరణించినట్టు భావిస్తున్నారు అధికారులు. మరణించిన గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు అధికారులు.
►ALSO READ | తెలంగాణలో డ్రగ్, గన్ కల్చర్ తెచ్చిందే కేటీఆర్: మంత్రి తుమ్మల
మృత్యువాత పడ్డ గొర్రెల విలువు దాదాపు రూ 15 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గొర్రెల పెంపకమే తమ జీవనాధారం కావడంతో కన్నీరుమున్నీరవుతున్నారు రైతులు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని గొర్రెల కాపర్లు కోరుతున్నారు.
