హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా

హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా

హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్‌ కు వచ్చారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ బండారు దత్తాత్రేయ తదితరులు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో అమిత్ షా నిజామాబాద్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. నగరంలోని భూమారెడ్డి ఫంక్షన్‌ హాల్‌ లో నిర్వహించే ఐదు పార్లమెంటు నియోజకవర్గాల బూత్, శక్తి ఇన్‌చార్జీలు, నాయకుల సమావేశంలో పాల్గొని ఆయన ప్రసంగించనున్నారు.