రేపు అమిత్ షా రాక.. ఇదీ షెడ్యూల్

రేపు అమిత్ షా రాక.. ఇదీ షెడ్యూల్

రేపు రాష్ట్రానికి బీజేపీ చీఫ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. 2023లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేయనున్నారు. ఇందులో భాగంగా..  పార్టీ సభ్యత్వ నమోదును శనివారం ప్రారంభించనున్నారు. ఆయన పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

మద్యాహ్నం 12.30నిమిషాలకు ఢిల్లీ నుంచి బయలు దేరి 2.40నిమి..లకు శంషాబాద్ కు చేరుకుంటారు అమిత్ షా. 2.50నిమి ల నుండి 3.30 వరకు ఎయిర్ పోర్ట్ లోనే CISF ఆఫీసర్లతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించనున్నారు.

మధ్యాహ్నం 3.45నిమిలకు… నగరంలోని పహాడీ శరీఫ్ లోని రంగనాయక తండాకు వెళ్లి… ఒక గిరిజన కుటుంబానికి పార్టీ సభ్యత్వాన్ని ఇవ్వనున్నారు అమిత్ షా. ఆ తర్వాత 4.30నిమిషాలకు… KLCC పంక్షన్ హాల్ లో నిర్వహించే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో భారీగా సభ్యత్వ నమోదు జరుగనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాత్రి 7.15నిమిషాలకు నోవాటెల్ హోటల్ లో రాష్ట్రానికి చెందిన 20మంది ముఖ్యనాయకులతో మీటింగ్ లో పాల్గొంటున్నారు అమిత్ షా. ఆ తర్వాత రాత్రి 9.30కి తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు అమిత్ షా.