నితీశ్‌ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న అమిత్‌షా,నడ్డా

నితీశ్‌ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న అమిత్‌షా,నడ్డా

ఇవాళ (సోమవారం)బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. బీజేపీకి చెందిన తారా కిషోర్ ప్రసాద్, రేణుదేవిలు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మొదటి విడతలో 14 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నవారిలో జేడీయూ నుంచి విజేంద్ర యాదవ్, విజయ్ చౌదరి, అశోక్ చౌదరి, మేవాలాల్ చౌదరి, షీలా మండల్  ఉన్నారు. ఇక బీజేపీ నుంచి మంగళ్ పాండే, రాంప్రీత్ పాశ్వాన్ తదితరులు ఉన్నారు. హిందుస్థాన్ అవామీ మోర్చా నుంచి సంతోశ్ మాంఝీ, వీఐపీ నుంచి ముఖేశ్ మల్లా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.