
భారత జాతి ఐక్యతకు కృషి చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా పటేల్ చౌక్ లోని ఆయన చిత్ర పటానికి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా అక్టోబర్ 31న ఏక్తా దివాస్ గా నిర్వహిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. దేశానికి సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, మంత్రి మీనాక్షి లేఖి పాల్గొన్నారు.