ట్రైనీ ఐపీఎస్ ల నుండి గౌరవందనం స్వీకరించిన అమిత్ షా

ట్రైనీ ఐపీఎస్ ల నుండి గౌరవందనం స్వీకరించిన అమిత్ షా

హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో 75వ బ్యాచ్ IPS ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. పరేడ్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. నేషనల్ పోలీస్ అకాడమీలోని సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు అమిత్ షా. తర్వాత ట్రైనీ  IPS ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.  ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, డీజీపీ అంజనీకుమార్, పలువురు IPS లు, IAS లు హాజరయ్యారు. 

 

పోలీస్ అకాడమీలో 75 వ బ్యాచ్ లో.... 175 మంది ట్రైనీ IPS లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇందులో ఇండియన్  ట్రైనీ IPS లు 155 మంది, మరో 20 మంది ఫారిన్ ఆఫీసర్లు ఉన్నారు. IPS బ్యాచ్ లో 34 మంది మహిళా ట్రైనీ IPS లు ఉన్నారు. వీరిలో 32 మంది ఇండియన్ ట్రైనీలు కాగా, ఇద్దరు విదేశీయులు ఉన్నారు.  
 
రెండు తెలుగు రాష్ట్రాలకు 14 మంది ట్రైనీ IPS లను కేటాయించారు. తెలంగాణకు 9 మంది, AP కి ఐదుగురు IPS లను కేటాయించారు. 155 ట్రైనీ IPS  లలో 102 మంది  ఇంజనీరింగ్ బ్యాగ్రౌండ్ వారే. 25 ఏళ్ళు లోపు 9 మంది ఉన్నారు.