తుఫాన్ ని ఎదుర్కోవడానికి కేంద్రం రెడీ: అమిత్​షా

తుఫాన్ ని ఎదుర్కోవడానికి కేంద్రం రెడీ: అమిత్​షా

బిపర్​జాయ్​తుఫాన్​ని ఎదుర్కోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​షా తెలిపారు. ఇదే విషయంపై ఢిల్లీలో ఆయన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తుపాన్​ ప్రభావిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  ఇప్పటికే 8 వేల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించామన్నారు.  ఎన్డీఆర్​ఎఫ్, భద్రత, వైమానిక దళ సిబ్బంది గుజరాత్ కి చేరుకున్నట్లు చెప్పారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు. 

జూన్​ 15 నాటికి ఉత్తర గుజరాత్​, పాకిస్థాన్ పై ఈ తుఫాన్​ ప్రభావం భారీగా పడనుందని ఐఎండీ హెచ్చరించింది.  వచ్చే 8 గంటల్లో సూపర్​ సైక్లోన్ గా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.  దీని ప్రభావంతో ఈ నెల 16 వరకు గుజరాత్​లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.