బెంగాల్ ను సొనార్ బంగ్లా గా మార్చడమే మా ధ్యేయం

బెంగాల్ ను సొనార్ బంగ్లా గా మార్చడమే మా ధ్యేయం

బెంగాల్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తమ లక్ష్యం కాదన్నారు హోంమంత్రి అమిత్ షా. బెంగాల్ లోని మహిళలు, పేదల పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. బెంగాల్ లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించినట్టు చెప్పారు అమిత్ షా. బెంగాల్ ను సొనార్ బంగ్లా గా మార్చడమే ధ్యేయమన్నారు. బీజేపీ కార్యకర్తలకు, తృణముల్ సిండికేట్ కు మధ్య యుద్దంగా అభివర్ణించారు. బెంగాల్ లో పర్యటిస్తున్న అమిత్ షా.. సౌత్ పర్గనాస్ జిల్లాలో ఐదవదశ పరివర్తన్ యాత్రను షా ప్రారంభించారు. అంతకుముందు కోల్ కతాలోని రాష్ బెహారీ ఎవెన్యూలోని భారత్ సేవాశ్రమ్ ను సందర్శించారు అమిత్ షా. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షాను ఘనంగా సన్మానించారు ఆశ్రమ నిర్వాహకులు.