‘తుక్డే.. తుక్డే’ పార్టీలకు బుద్ధి చెప్పాలి: అమిత్‌ షా

‘తుక్డే.. తుక్డే’ పార్టీలకు బుద్ధి చెప్పాలి: అమిత్‌ షా

న్యూఢిల్లీ: సి టిజన్‌ షిప్‌ సవరణ చట్టంపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కావాలనే తప్పుడు ప్రచారం చేస్త ోందని కేం ద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. గురువారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో మాట్లా డిన షా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డా రు. “సిటిజన్‌ షిప్‌ సవరణ చట్టంపై పార్లమెంట్‌ లో చర్చ జరిగినప్పుడు
ఎవరూ ఏం మాట్లా డలేదు. అక్కడ నుంచి (పార్లమెంట్‌ ) బయటకు వచ్చి.. ఇప్పుడు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. కాం గ్రెస్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలోని తుక్డే..తుక్డే గ్యాంగ్‌ కు ఢిల్లీ ఓటర్లు బుద్ధి చెప్పాలి” అని షా అన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ ప్రభుత్వంపై కూడా షా విమర్శలు చేశారు.
కారు, బంగ్లా తీసుకోనని చెప్పిన కేజ్రీవాల్‌ వాటిని తీసుకున్నారని విమర్శించారు. 2015లో ఇచ్చిన హామీల్లో ఆప్‌ ప్రభుత్వం 80 శాతం కూడా నెరవేర్చలేదని అన్నారు. షా కామెంట్ స్‌ కు ఆప్‌ కౌం టర్‌ ఇచ్చింది. కేజ్రీవాల్‌ చేసిన అభివృద్ధి లిస్ట్‌‌‌‌‌‌‌‌ను ట్వీట్‌ చేసింది .