
కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్‌షా. ఆదివారం పుదుచ్చేరిలో బీజేపీ ఎన్నికల ర్యాలీ నిర్వహించింది. ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా..వారసత్వ రాజకీయాలతో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కుప్పకూలుతోందన్నారు. అందుకే సీనియర్లు ఆ పార్టీని వీడుతున్నారని తెలిపారు. పుదుచ్చేరి మాజీ సీఎం కె నారాయణస్వామి గాంధీ కుటుంబానికి సేవ చేయడంపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. కేంద్రం నిధుల నుంచి రూ.15 వేల కోట్లను గాంధీ కుటుంబానికి నారాయణ స్వామి కట్ మనీగా ఇచ్చారని ఆరోపించారు. మెజార్టీ కోల్పోవడం, కేంద్రం పథకాలపై పెట్టీ పాలిటిక్స్ చేయడం కారణంగానే నారాయణస్వామి ప్రభుత్వం కూలిపోయిందని తెలిపారు.