అమిత్ షాకు సమన్లు జారీ చేసిన ప్రత్యేక కోర్టు

అమిత్ షాకు సమన్లు జారీ చేసిన ప్రత్యేక కోర్టు

బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు పశ్చిమ బెంగాల్‌ ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ బచ్చన్‌ వేసిన పరువు నష్టం దావా కేసులో ఈ సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలంటూ అమిత్‌ షాకు సూచించింది. వ్యక్తిగతంగా, లేదా లాయర్‌ ద్వారా గానీ సోమవారం ఉదయం 10 గంటలకు కోర్టుకు హాజరు కావాలని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.

2018 ఆగస్టు 11న కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో TMC నేత, ఎంపీ అభిషేక్‌ బెనర్జీ పరువుకు నష్టం కలిగించేలా అమిత్‌ షా వ్యాఖ్యలు చేశారని తెలుపుతూ…ఆయన తరఫు లాయర్ సంజయ్‌ బసు చెప్పారు. ప్రస్తుతం అమిత్‌ షా బెంగాల్‌ పర్యటనలోనే ఉన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న బెంగాల్‌కు వచ్చిన ఆయన.. ఐదో విడత పరివర్తన్‌ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మమతా బెనర్జీ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.