తెలంగాణకు అండగా ఉండేందుకు పులి వేట ప్రారంభించింది: బండి సంజయ్

తెలంగాణకు అండగా ఉండేందుకు పులి వేట ప్రారంభించింది: బండి సంజయ్

తెలంగాణను అభివృద్ది చేయడానికే అమిత్ షా రాష్ట్రానికి వచ్చిండని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నారు.  బీజేపీ  ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరు పేదలకు ఇండ్లు ఇస్తామన్నారు.  నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జాబ్ క్యాలండర్ రిలీజ్ చేసి ఒకటో తేదీనే జీతాలిస్తామని తెలిపారు.

 కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా మారిండంటూ ... ప్రజా సమస్యలపై గళమెత్తితే తనను పోలీసులు అర్దరాత్రి అరెస్ట్ చేసి 8 గంటలు రోడ్లపై తిప్పారని విరుచుకుపడ్డారు బండి సంజయ్.  తెలంగాణ ప్రజలకు అండగా ఉండేందుకు పులి వేట ప్రారంభించిందని చేవెళ్ల విజయ సంకల్ప సభలో బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ తెలంగాణ అభివృద్దికి  ఆటంకం కలిగిస్తున్నాడని విరుచుకుపడ్డారు.

అక్రమంగా అరెస్ట్ చేశారు

తనను పదో తరగతి పేపర్ లీకేజ్ కేసులో అక్రమంగా అరెస్ట్  చేశారని బండి సంజయ్ అన్నారు.   తనను కొత్తపేట,   ప్రజ్ఝాపూర్, భువనగిరి తీనుకుపోయే సమయంలో 8 గంటలు రోడ్లపై తిప్పారు. ఈ క్రమంలో కరీంనగర్ దాటిన తరువాత  ఢిల్లీ నుంచి ఫోన్ చేశారని తన భార్య తెలిపిందన్నారు.  తన వద్దకు ఓ కానిస్టేబుల్ వచ్చి ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్దం కావడం లేదంటూ... భయపడుతున్నామని చెప్పారని బండి సంజయ్ చేవెళ్ల సభలోతెలిపారు.  మీరేం భయపడకండి.. ఢిల్లీ నుంచి పులి వస్తోంది. వేటాడటం మొదలైందని చెపుతూ... కార్యకర్తలను కాపాడే టైగర్ చేవెళ్ల గడ్డకు వచ్చిందన్నారు.