ఏవీఎన్ రెడ్డి గెలుపు.. అమిత్ షా, నడ్డా ట్వీట్

ఏవీఎన్ రెడ్డి గెలుపు.. అమిత్ షా, నడ్డా  ట్వీట్

మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచిన ఏవీఎన్ రెడ్డికి కేంద్ర హోమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందనలు తెలిపారు.  ఇది చారిత్రాత్మక విజయమని అన్నారు. బండి సంజయ్ తో పాటు ఏవీఎన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు  అభినందనలు తెలిపారురు. తెలంగాణ ప్రజలు అవినీతితో విసిగిపోయారని.. మోడీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఈ విజయంతో తెలియజేస్తోందని తెలిపారు.

బీజేపీ బలపర్చిన ఏవీఎన్ రెడ్డి సమీప పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డిపై  సుమారు 1150 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నవీన్ రెడ్డి గెలుపుతో పార్టీ కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.