మన నేలపై కన్ను వేసే శక్తి ఎవ్వరికీ లేదు : అమిత్ షా

మన నేలపై కన్ను వేసే శక్తి ఎవ్వరికీ లేదు :  అమిత్ షా
  • సూది మొనంత భూమిని కూడా ఆక్రమించలేరు
  • చైనాకు అమిత్ షా పరోక్ష హెచ్చరిక
  • భారత ప్రాదేశిక సమగ్రతను ఎవరూ ప్రశ్నించలేరు
  • మన నేలపై కన్ను వేసే శక్తి ఎవ్వరికీ లేదు
  • అరుణాచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కిబితూలో ‘వైబ్రెంట్ విలేజ్’ ప్రోగ్రాం ప్రారంభించిన కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ/కిబితూ(అరుణాచల్ ప్రదేశ్)/బీజింగ్: భారత ప్రాదేశిక సమగ్రతను ఏ ఒక్కరూ ప్రశ్నించలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సూది కొన మోపినంత భూమిని కూడా ఎవ్వరూ ఆక్రమించలేరని స్పష్టంచేశారు. ఇటీవల అరుణాచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కొన్ని ప్రాంతాల పేర్లను చైనా మార్చడం, తన అరుణాచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తంచేసిన నేపథ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం అరుణాచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కిబితూ అనే సరిహద్దు గ్రామంలో ‘వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ను ప్రారంభించారు. 1962 యుద్ధంలో ప్రాణాలర్పించిన అమరులకు నివాళులర్పించారు. ‘‘ఐటీబీపీ జవాన్ల కారణంగానే మొత్తం దేశమంతా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నది. ఆర్మీ రాత్రి పగలూ బార్డర్లలో పహారా కాస్తున్నది. ఈ రోజు మన నేలపై కన్నువేసే శక్తి ఎవరికీలేదని గర్వంగా ప్రకటించగలుగుతున్నాం” అని వివరించారు.

ఐటీబీపీ, ఆర్మీ ఉన్నయ్..

‘‘భారతదేశ సరిహద్దుల్లో భూమిని ఎవరైనా ఆక్రమించగలిగే రోజులు పోయాయి. ఈ రోజు బార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐటీబీపీ, ఇండియన్ ఆర్మీ ఉన్నాయి. మన భూమిని ఎవరూ ఆక్రమించలేరని గర్వంగా చెప్పగలం. జవాన్ల త్యాగాలకు వందనం చేస్తున్నా. 1962లో ఇక్కడి భూమిని ఆక్రమించేందుకు వచ్చిన వాళ్లు.. ఇక్కడి ప్రజల దేశభక్తి బలంతోనే వెనక్కి వెళ్లిపోయారు” అని అమిత్ షా అన్నారు. ‘‘ఇంతకుముందు సరిహద్దు ప్రాంతాల నుంచి తిరిగి వచ్చిన ప్రజలు భారతదేశంలోని చివరి గ్రామాన్ని సందర్శించామని చెప్పేటోళ్లు. కానీ మోడీ ప్రభుత్వం  వచ్చాక పరిస్థితి మారింది. భారతదేశంలోని మొదటి గ్రామాన్ని సందర్శించినట్లు జనం చెబుతున్నారు” అని షా అన్నారు. ‘‘2014కి ముందు ఈశాన్య ప్రాంతమంతా అస్తవ్యస్థంగా ఉండేది. గత 9 ఏండ్లుగా.. ప్రధాని మోదీ ‘లూక్ ఈస్ట్’ విధానం వల్ల ఈశాన్య ప్రాంతం ఇప్పుడు దేశాభివృద్ధికి దోహదపడే ప్రాంతంగా మారింది” అని అమిత్​ షా చెప్పారు.

నమస్తే కాదు.. జైహింద్ అంటరు!

‘‘అరుణాచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘నమస్తే’ అని ఎవరూ అనరు. ప్రజలు ఒకరికొకరు ‘జై హింద్’ అని పలకరించుకుంటారు. అది మన హృదయాలను దేశభక్తితో నింపుతుంది. అరుణాచల్​ వాసుల ఈ వైఖరి కారణంగానే.. ఆక్రమణకు వచ్చిన చైనా వెనక్కి తగ్గింది” అని అమిత్ షా చెప్పారు. మన సరిహద్దులు, మన బలగాల గౌరవాన్ని ఎవరూ సవాలు చేయకూడదన్నదే తమ విధానమని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటును అంతం చేసి, శాంతిని, వేగవంతమైన అభివృద్ధిని తీసుకువచ్చిందని అమిత్ షా అన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు గత ప్రభుత్వాలు దశాబ్దాలుగా చేయలేని దాన్ని మోడీ ప్రభుత్వం తన రెండు టర్మ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే చేసి చూపించిందని చెప్పారు. ఆర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నార్త్ ఈస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 70% ఏరియాల్లో ఎత్తేసినట్లు తెలిపారు. పూర్తిగా ఎత్తివేసే రోజు ఎంతో దూరం లేదన్నారు.

వైబ్రెంట్ విలేజ్ అంటే..

మారుమూల సరిహద్దు ప్రాంతాల్లో నల్లా నీరు, విద్యుత్, వంటగ్యాస్, డిజిటల్, ఫిజికల్ కనెక్టివిటీ, ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించినదే ‘వైబ్రెంట్ విలేజ్’ పథకమని అమిత్ షా చెప్పారు. ఇవన్నీ అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం మూడేండ్ల టార్గెట్ పెట్టుకుందని తెలిపారు. 

చైనా అభ్యంతరం

అరుణాచల్​లో అమిత్ షా పర్యటించడంపై చైనా అభ్యంతరం తెలిపింది. తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించడమే అని వ్యాఖ్యానించింది. ‘జంగ్నాన్ (అరుణాచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చైనా పెట్టిన పేరు).. చైనాలో భాగం. జంగ్నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారతీయ సీనియర్ అఫీషియల్ కార్యకలాపాలు.. చైనా ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తున్నాయి. సరిహద్దుల్లో ప్రశాంతతను ఇది దెబ్బతీస్తుంది” అని చైనా ప్రభుత్వ ప్రతినిధి అన్నారు.