బిగ్ బితో రష్మిక.. ‘గుడ్ బైై’ రిలీజ్ డేట్ కన్ఫాం

బిగ్ బితో రష్మిక.. ‘గుడ్ బైై’ రిలీజ్ డేట్ కన్ఫాం

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, నటి రష్మిక మందన్నలు నటిస్తున్న బాలీవుడ్ సినిమా ‘గుడ్ బై’ మూవీకి సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. విడుదల తేదీని కూడా ప్రకటించారు. అక్టోబర్ 07న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. పోస్టర్ కు సంబంధించిన విషయానికి వస్తే.. డీ గ్లామర్ లుక్‌ లో రష్మిక కనిపించారు. అమితాబ్ గాలి పటం ఎగురేస్తుండగా వెనుకాలే ఉన్న రష్మిక చరకా పట్టకుని ఉంది. ఇద్దరూ చిరు నవ్వుల చిందిస్తున్న ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకొంటోంది. వికాస్ బహెల్ దర్శకత్వంలో  రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూతురిగా రష్మిక కనిపించనున్నారు.

మానవ సంబంధాలపై మనస్సును హత్తుకొనే విధంగా తెరకెక్కించారని తెలుస్తోంది. సాహిల్ మెహతా, శివిన్ నారంగ్ ఇతరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక రష్మిక విషయానికి వస్తే... వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. ‘పుష్ప’ సినిమాతో రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయారు. నార్త్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో అగ్ర హీరోల సరసన నటించారు. తమిళంలో కార్తీతో ‘సుల్తాన్’ చేశారు. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ‘వారసుడు’లో నటిస్తున్నారు. హిందీలో మిషన్ మజ్ను, యానిమల్ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.