ఈ 2026 సంక్రాంతి పండుగకు పెద్ద సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు అన్నీ పోటాపోటీగా వస్తున్నాయి. ఒకవైపు భారీ ఫ్యాన్‌బేస్ ఉన్న స్టార్లు, మరోవైపు యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోలు థియేటర్లను టార్గెట్ చేసుకున్నారు. అందుకే ఈసారి బాక్సాఫీస్ వార్ మామూలుగా ఉండబోదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ పొంగల్ ముందువారం అంటే జనవరి 5 నుంచి 10 వరకు థియేటర్లో రిలీజయ్యే సినిమాలు, ఓటీటీకి దర్శనం ఇచ్చే సినిమాలు ఏంటనేది ఓ లుక్కేద్దాం.
ది రాజా సాబ్- జనవరి 9
సలార్', 'కల్కి 2898 AD' వంటి భారీ యాక్షన్ చిత్రాల తర్వాత, ప్రభాస్ తన రూట్ మార్చి వింటేజ్ లుక్‌లో ఫ్యాన్స్‌ను అలరించడానికి సిద్ధమయ్యారు. మారుతి దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ది రాజా సాబ్'. ఈ శుక్రవారం జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం (Dual Role) చేస్తున్నారు. ఒకటి స్టైలిష్‌గా ఉండే యువకుడి పాత్ర కాగా, మరొకటి భయంకరమైన గెటప్‌లో ఉండే 'రాజా సాబ్' పాత్ర అని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పోస్టర్లలో ప్రభాస్ వింటేజ్ లుక్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి.
జన నాయగన్- జనవరి 9
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన పొలిటికల్ ఎంట్రీకి ముందు చేస్తున్న చివరి చిత్రం కావడంతో ‘జన నాయగన్’ (Jana Nayagan) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్, తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో విడుదల కానుంది. అయితే, ఈ సినిమా భగవంత్ కేసరి రీమేక్ అనే వార్తలు వస్తున్నాయి. ట్రైలర్ కూడా అలానే ఉండటంతో అంతా అదే అని ఫిక్స్ అవుతున్నారు. కానీ, మేకర్స్ ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. చూడాలి మరి ఏమవుతుందో!!
పరాశక్తి- జనవరి 10
హీరో శివ కార్తికేయన్-నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగర కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ పరాశక్తి (PARASAKTHI). ఈ సినిమాతో శ్రీలీల తమిళంలో ఎంట్రీ ఇస్తుంది. ఇందులో జయం రవి, అథర్వ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
►ALSO READ | Anupama Parameswaran: కొత్త సెన్సేషన్కు శ్రీకారం.. అనుపమ–తరుణ్ భాస్కర్ ‘క్రేజీ కళ్యాణం’
పీరియాడికల్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో శివ కార్తికేయన్ ఒక స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నారు. జయం రవి క్రూరమైన విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ‘ఆకాశమే నీ హద్దురా’ డైరెక్టర్ సుధా కొంగర.. ఈ సినిమాను పవర్ ఫుల్ పొలిటికల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించింది.
బెంగాలీ సినిమాలు:
అంకుష్ హజ్రా నటించిన ‘నారీ చరిత్రో బిజయ్ జోటిల్’, ‘కీర్తనేర్ పోర్ కీర్తన్’ చిత్రాలు జనవరి 9నే బెంగాలీ ప్రేక్షకులను పలకరించనున్నాయి.
నెట్‌ఫ్లిక్స్:
స్ట్రేంజర్ థింగ్స్ 5 – వాల్యూమ్ 2 (ఎపిసోడ్‌లు 5,6,7)
హిస్ & హెర్స్ (సైకలాజికల్ థ్రిల్లర్)- జనవరి 8
అఖండ 2: తాండవం- (తెలుగు యాక్షన్/మైథికల్ థ్రిల్లర్) - జనవరి 9
దే దే ప్యార్ దే 2 (రొమాంటిక్ కామెడీ)- జనవరి 9
పీపుల్ వి మీట్ ఆన్ వెకేషన్ (రొమాంటిక్ కామెడీ)- జనవరి 9
ఆల్ఫా మేల్స్ – సీజన్ 4
సోనీ లివ్
షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 5 – జనవరి 5
ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ (హిస్టారికల్ సిరీస్) – జనవరి 9
కాలంకావల్ (మలయాళ క్రైమ్ థ్రిల్లర్) – జనవరి 9
మాస్టర్‌చెఫ్ ఇండియా – హిందీ సీజన్ 9 (రియాలిటీ, జనవరి 5)
అమెజాన్ ప్రైమ్:
బాల్తీ (మలయాళ స్పోర్ట్స్ యాక్షన్)- జనవరి 9
ది నైట్ మేనేజర్ సీజన్ 2 (స్పై థ్రిల్లర్)- జనవరి 11
ఆది పినిశెట్టి డ్రైవ్ (తెలుగు / తమిళ్)
120 బహదూర్ (హిందీ)
జీ5:
మాస్క్ (తమిళ క్రైమ్ థ్రిల్లర్)
హనీమూన్ సే హత్య (హిందీ డాక్యుమెంటరీ)
ఈటీవీ విన్
తోవ్వ – జనవరి 4
కానిస్టేబుల్ కనకం సీజన్ 2 – జనవరి 8
జియో హాట్‌స్టార్
ట్రాన్: ఏరిస్ (సై-ఫై, జనవరి 7)
వెపన్స్ (హారర్, జనవరి 8)
ఇలా సంక్రాంతికి ముందే థియేటర్లు, ఓటీటీలు ఫుల్ ప్యాక్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సిద్ధంగా ఉన్నాయి. స్టార్ పవర్, కంటెంట్ పవర్ రెండూ కలసి 2026 బాక్సాఫీస్‌ని షేక్ చేయబోతున్నాయి.
