ఆర్జీవీ డెన్‌‌లో సర్కార్‌‌‌‌..అతిథి మర్యాదలతో వర్మ

ఆర్జీవీ డెన్‌‌లో సర్కార్‌‌‌‌..అతిథి మర్యాదలతో వర్మ

అమితాబ్ బచ్చన్, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌‌ అనగానే ‘సర్కార్’ సినిమా గుర్తొస్తుంది. ఓ దర్శకుడిగా వర్మను ఎంతగానో అభిమానిస్తారు బిగ్‌‌ బి. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘వెట్టైయన్‌‌’లో కీలకపాత్ర పోషిస్తున్న ఆయన

ఈ మూవీ షూటింగ్‌‌ కోసం హైదరాబాద్‌‌ వచ్చారు. తన పాత్ర షూటింగ్ పూర్తవడంతో  వర్మను కలిసేందుకు ‘ఆర్జీవీ డెన్‌‌’కు వచ్చారు. తన సీట్‌‌లో కూర్చోబెట్టి మరీ అతిథి మర్యాదలు చేసిన వర్మ, ఇందుకు సంబంధించిన ఫొటోస్‌‌ను సోషల్‌‌ మీడియాలో పోస్ట్ చేశారు.