కేబీసీ సెట్స్‌లో హీరోయిన్‌‌తో బిగ్‌బీ సందడి 

కేబీసీ సెట్స్‌లో హీరోయిన్‌‌తో బిగ్‌బీ సందడి 
  • కృతి సనన్‌తో అమితాబ్ స్టెప్పులు

ముంబై: బాలీవుడ్ దిగ్గజం బిగ్ బీ లేటు వయస్సులోనూ జోరును కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ యువ నటులకు అమితాబ్ సవాల్ విసురుతున్నారు. మూవీలతోపాటు కౌన్ బనేగా క్రోర్‌పతి (కేబీసీ) లాంటి షోతో టెలివిజన్ ఆడియన్స్‌ను కూడా అలరిస్తున్నారు. తాజాగా కేబీసీ వేదికపై ఆయన చేసిన డ్యాన్స్ వైరల్ అవుతోంది. ప్రముఖ హీరోయిన్ కృతి సనన్‌తో అమితాబ్ స్టెప్పులు వేశారు. కృతీతో డ్యాన్స్ చేయడం గురించి స్పందిస్తూ ఇన్‌స్టాలో బిగ్ బీ ఓ పోస్ట్ పెట్టారు. ఇది కోల్‌కతాలో తన కాలేజీ రోజులను గుర్తు చేసిందన్నారు.  ఇకపోతే వన్.. నేనొక్కడినే, దోచెయ్ లాంటి చిత్రాలతో తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకుంది కృతి సనన్‌. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలసి ఆదిపురుష్‌ లాంటి భారీ ప్రాజెక్టులో ఆమె నటిస్తోంది. 

మరిన్ని వార్తల కోసం:

ఆసీస్ మాజీ బ్యాట్స్‌మన్ అరెస్ట్

సెల్ ఫోన్ పక్కన పెడితే కొలువు మీదే

రైతు సమస్యలు పరిష్కరిస్తేనే సీట్ల పంపకం: అమరిందర్ సింగ్