రైతుల సమస్యలు పరిష్కరిస్తేనే సీట్ల పంపకం

రైతుల సమస్యలు పరిష్కరిస్తేనే సీట్ల పంపకం

చండీగఢ్: పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ కొత్త పార్టీని పెట్టనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పోరాడుతూనే ఉంటామన్న కెప్టెన్.. అతి త్వరలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ పార్టీ ద్వారా రైతుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వచ్చే ఏడాది జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేస్తామన్నారు. అయితే సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిగా నిరసన తెలుపుతున్న రైతుల డిమాండ్లను కేంద్రం పరిష్కరించాలని మెలిక పెట్టారు. అన్నదాతల సమస్యలు పరిష్కారమైతేనే ఎలక్షన్లలో బీజేపీతో కలసి సీట్ల పంపకం ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో అకాలీదళ్‌తో విడిపోయిన పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. పంజాబ్ ప్రజల ఆసక్తులతోపాటు రైతుల శ్రేయస్సే ధ్యేయంగా ఈ పార్టీ పని చేస్తుందని అమరిందర్ మీడియా అడ్వయిజర్ రవీన్ తుర్కల్ తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం: 

సెల్ ఫోన్ పక్కన పెడితే కొలువు మీదే

ప్రేమగా చూస్తలేరని ఇంట్లో వాళ్లను చంపింది

రెండ్రోజుల తర్వాత మళ్లీ పెరిగిన పెట్రో ధరలు