ఆగని పెట్రో వాత.. హైదరాబాద్ లో లీటర్ రూ. 110కి పైగానే..

 ఆగని పెట్రో వాత.. హైదరాబాద్ లో లీటర్ రూ. 110కి పైగానే..

రెండు రోజుల గ్యాప్ తర్వాత పెట్రోల్,డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ పై 34 నుంచి 35 పైసలు పెరగగా..డీజిల్ పై 35 నుంచి 37 పైసలు పెరిగింది. దాంతో హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ. 110.46 పైసలకు చేరుకోగా.. డీజిల్ ధర రూ. 103.56 పైసలకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 35 పైసలు, లీటర్ డీజిల్ పై పైసలు పెరిగింది. దీంతో ఆ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర 106 రూపాయల 19 పైసలకు చేరగా..డీజిల్ ధర 94 రూపాయల 92 పైసలకు పెరిగింది. ముంబైలో లీటర్ పెట్రోల్ పై 34 పైసలు, లీటర్ డీజిల్ పై 37 పైసలు పెరిగింది. ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో 112 రూపాయల 11 పైసలకు పెరగగా...డీజిల్ ధర 102 రూపాయల 89 పైసలకు చేరింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటగా..డీజిల్ ధర కూడా పలు రాష్ట్రాల్లో మార్కులు దాటింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, బిహార్, కేరళ, కర్ణాటక, లడఖ్ లలో డిజీల్ ధర వంద దాటింది. సెప్టెంబర్ 28 తర్వాత లీటర్ పెట్రోల్ పై 4 రూపాయల 85 పైసలు పెరగగా..డీజిల్ పై 5 రూపాయల 95 పైసలు పెరిగింది.