గృహ హింస కేసులో పోలీసుల అదుపులోకి ఆసీస్ మాజీ బ్యాట్స్‌మన్

గృహ హింస కేసులో పోలీసుల అదుపులోకి ఆసీస్ మాజీ బ్యాట్స్‌మన్

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ మైకేల్ స్లేటర్‌ అరెస్ట్ అయ్యాడు. గత వారం వెలుగుజూసిన ఓ గృహ హింస ఘటనలో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు ఆస్ట్రేలియన్ మీడియాలో బుధవారం కథనాలు వచ్చాయి. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్‌ మొదలైందని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. స్లేటర్‌ను అరెస్ట్ చేశామని.. మాన్లీ పోలీసు స్టేషన్‌కు తరలించామని పోలీసులు ఓ ప్రకటలో తెలిపారు. కాగా, 74 టెస్టులు, 42 వన్డేల్లో ఆసీస్ జట్టుకు స్లేటర్ ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్‌‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత కామెంట్రీని మొదలుపెట్టాడు. గత మూడేళ్లుగా సెవన్ నెట్‌వర్క్స్ అనే సంస్థలో స్లేటర్ కామెంటేటర్‌గా పని చేస్తున్నాడు. కారణాలు తెలియరాకున్నా.. గత నెలలో సెవన్ నెట్‌వర్క్స్ తమ కామెంట్రీ టీమ్ నుంచి స్లేటర్‌ను  తొలగించింది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఈ ఏడాది మేలో స్లేటర్ వివాదంలో కూడా చిక్కుకున్నాడు.   

మరిన్ని వార్తల కోసం: 

సెల్ ఫోన్ పక్కన పెడితే కొలువు మీదే

ప్రేమగా చూస్తలేరని ఇంట్లో వాళ్లను చంపింది

రైతు సమస్యలు పరిష్కరిస్తేనే సీట్ల పంపకం: అమరిందర్ సింగ్